Monday, January 20, 2025

13న నిజాంసాగర్‌ కు మంత్రి కెటిఆర్ రాక

- Advertisement -
- Advertisement -

నిజాంసాగర్: ఈ నెల 13న నిజాంసాగర్ మండలానికి రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ విచ్చేస్తుండటంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించి జక్కాపూర్, వడ్డేపల్లి శివారులో నూతనంగా నిర్మించిన పైలాన్, అతిథి గృహాలు, సభా స్థలిని పరిశీలించారు. ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.

పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ఏర్పాట్లు, తదితర వాటితో రెవెన్యూ, నీటి పారుదల, రోడ్డు భవనాల శాఖ అధికారులతో సమీక్షించారు. మంత్రి నాగమడుగు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడంతో పాటు బ్రిడ్జి ప్రారంభోత్సవం, అతిథి గృహాలకు మరమ్మతులు చేపట్టడంతో వాటిని కూడా తిరిగి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, స్థానిక నాయకులు దుర్గారెడ్డి, రమేష్ గౌడ్, తహసీల్దార్ నారాయణ, ఆర్‌ఐ విజయ్ కుమార్, తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News