Wednesday, January 22, 2025

పేదరికమే కొలమానం

- Advertisement -
- Advertisement -

కులమేదైనా, మతమేదైనా అందరికీ సమన్యాయం

పేదల అభ్యున్నతే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షం సంక్షేమ పథకాల్లో
దేశానికే మార్గదర్శకులం రైతు బీమా.. వారి కుటుంబాలకే ధీమా
సిరిసిల్ల ప్రగతి ట్రైనీ ఐఎఎస్‌లకే బోధనాంశం : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల : అభివృధ్ధి నా కులం, సంక్షేమం నా మతమని, అన్ని మతాలు, కులాల్లో నిరుపేదలున్నారని, కులమతాలకు అతీతంగా సమన్యాయంతో సంక్షేమ పథకాలను అందించడమే తమ ప్రభు త్వ లక్షమని, పేదరికం అన్ని కులాలు, మతా ల్లో ఉందని, పేదవారు ఏ కులంలో ఉన్నా.. వారికి న్యాయం చేయాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అ న్నారు. శుక్రవారం సిరిసిల్లలో జిల్లా రెడ్డి సం ఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన అ నంతరం జరిగిన సమావేశంలో మంత్రి మా ట్లాడారు. పేదల సంక్షేమం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ, అభివృధ్ధి పథకాలను రూ పొందిస్తున్నారన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రతి రైతు కుటుంబానికి బీమా సదుపాయం కల్పించారన్నారు. సహజ మరణమై నా, ప్రమాదవశాత్తు మరణించినా, పాము, తేలు కుట్టి, విద్యుత్తు షాక్ తగిలి చనిపోయినా రైతు కుటుంబాలకు రూ.5లక్షల బీమా అందిస్తున్నామన్నారు. రైతు బీమా అనేది రైతు కు టుంబాలకు ధీమా అన్నారు. రైతుబంధు కూ డా ఈ నెల 28నుంచి రైతుల ఖాతాల్లో పడనున్నాయన్నారు. ఇప్పటివరకు ఈ సీజన్ పంట ల రైతుబంధు కలుపుకుని రూ.58వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయన్నారు.

75 సంవత్సరాల పాలనలో రైతుబంధు, రైతు బీ మా వంటి కార్యక్రమాలను ఎవరూ అమలుపర్చలేదని అన్నారు. రైతు బిడ్డ కావడంవల్లే సి ఎం కెసిఆర్ నాయకత్వంలో ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నారన్నారు. సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్ కాకతీయతో చేపట్టిన చెరువుల అభివృధ్ధి వల్ల జిల్లాలో భూగర్భ జలాలు.. ఆరు మీటర్ల ఎత్తుకు ఉబికి వచ్చాయని, ముస్సొరీలోని లాల్ బహద్దూర్ శాస్త్రి అకాడమీలో ఐఏఎస్ శిక్షణార్థులకు సిరిసిల్ల నీటి సంరక్షణ విధానాన్ని పాఠ్యాంశంగా చేర్చారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. గతంలో టిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హమీ ఇచ్చినట్లు రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. కరోనా వల్ల కొంతకాలం ఆలస్యమైందని, సిరిసిల్లలో కోరినట్లు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు విషయం సిఎం కెసిఆర్‌తో చర్చించి త్వరలోనే నెరవేరుస్తానన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో విద్యా రంగంలో సిరిసిల్ల జిల్లాను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా జిల్లెల్ల వద్ద వ్యవసాయ కళాశాల భవనం త్వరలో ప్రారంభం కానుందన్నారు. సర్దాపూర్ వద్ద వ్యవసాయ పాలిటెక్నిక్ నడుస్తోందన్నారు.

త్వరలోనే సిఎం కెసిఆర్ మెడికల్ కళాశాలను ప్రారంభిస్తారన్నారు. అగ్రహరంలోని డిగ్రీ కళాశాలలో జెఎన్‌టియు సహకారంతో ఇంజనీరింగ్ కళాశాల నిర్వహిస్తున్నామని, పెద్దూరులో త్వరలో స్వంత భవనాలు ఏర్పాటవుతాయన్నారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌లో త్వరలో డిగ్రీ కళాశాలలు ప్రారంభిస్తామని చెప్పారు. అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలాలు మంజూరు చేస్తానన్నారు. సిరిసిల్లలో 2009లో మొదటిసారిగా శాసనసభ్యునిగా పోటిచేసిన నాడు తాను మంత్రిని అవుతానని అనుకోలేదని, సిరిసిల్ల ప్రజల ఆశీర్వాదాల వల్ల మంత్రి నయ్యానని, సమాజంలో గుర్తింపు వచ్చిందని, అంతర్జాతీయంగా అనేక నగరాలు తిరిగే అవకాశాలు వచ్చాయన్నారు. సిరిసిల్ల వారందరివాడిగా, పొత్తుల సద్దిగా మారి పనిచేస్తూ ముందుకు పోతానన్నారు. విద్య, వైద్య రంగాల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా సిరిసిల్లను, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ ప్రాయంగా నిలుపుతానన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు కూర అంజిరెడ్డి నాయకత్వంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. జడ్పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, జడ్పిటిసి పుర్మాణి మంజుల, రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలు నేవురి మమతతోపాటుగా వివిధస్థాయిలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న రెడ్డి సంఘం నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News