Sunday, September 22, 2024

టోలీచౌకిలో పర్యటించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR visits the flood Affected Areas

హైదారబాద్: నగరంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ రెండోరోజు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం టోలీచౌకిలోని నదీమ్ కాలనీలో మంత్రి కెటిఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్టాడి కెటిఆర్ భరోసా ఇచ్చారు. వరద ముంపు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిహెచ్ఎంసి అధికారులను ఆయన ఆదేశించారు. కాగా, నదీమ్ కాలనీలో రెండ్రోజులుగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారీగా కురిసిన వర్షాలకు టోలీచౌకిలో పలు కాలనీలు నీటమునిగాయి. బోట్ల ద్వారా వరద బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. నదీమ్ కాలనీలో ఆరుబోట్ల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదనీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారికిరెస్క్యూ బృందాలు ఆహారం అందిస్తున్నాయి. నదీమ్ కాలనీలో రెండ్రులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

Minister KTR visits the flood Affected Areas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News