Monday, January 20, 2025

పారిశ్రామిక శిఖరం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పరిశ్రమల రంగం అభివృద్ధి చెందినట్టుగా దేశంలో మరెక్కడా జరగలేదు

ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక విప్లవాత్మక
నిర్ణయాలు తీసుకున్నారు పెట్టుబడులు
పెట్టేవారికి ఇబ్బందులు లేకుండా టిఎస్‌ఐపాస్
విధానాన్ని తెచ్చాం దరఖాస్తు చేసుకున్న
15రోజుల్లోగా ఇటీవలి దావోస్
పర్యటనలోనూ పలు విదేశీ కంపెనీలు రాష్ట్రంలో
పెట్టుబడి పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశాయి
ఆస్ట్రేలియా సిజి ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా
పాల్గొన్న సందర్భంగా మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందినట్లుగా దేశంలో మరెక్కడా జరగడం లేదని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ప్రధానంగా పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న లక్షంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టిఎస్….ఐపాస్ అనే పాలసీని తీసుకొచ్చిందన్నారు. సోమవారం నగరంలోని తాజ్ దక్కన్‌లో జరిగిన ఆస్ట్రేలియన్ సిజి ఇవెంట్‌కు మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రొత్సాహం ఇవ్వడం వల్లే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు.

ముఖ్యంగా టిఎస్…ఐపాస్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజులుగా అన్ని రకాల అనుమతులను కంపెనీలకు జారీ చేస్తున్నామని మంత్రి కెటిఆర్ వివరించారు. ఫలితంగా దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. దీని వల్ల గడిచిన ఎనిమిదేళ్లలో 19 వేల పరిశ్రమలకు అనుమతులు జారీ చేయగా రికార్డు స్థాయిలో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 16 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పారిశ్రామిక విధానం బాగుండటం వల్ల తమకు వస్తున్న పెట్టుబడుల్లో 24 శాతం రిపీట్ అవుతున్నవే ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల తాను జరిపిన దావోస్ పర్యటనలో కూడా అనేక విదేశీ కంపెనీలు మన రా ష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అలాగే అనేక స్టార్టప్‌లకు కూడా మన రాష్ట్రం వేదికగా మారుతోందన్నారు. ఇప్పటికే టిహబ్‌ను మొదటి దశ భవనాన్ని ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలను సాధించగలిగామన్నారు. ఈ నేపథ్యం లో మాదాపూర్, నాలెజ్ట్ సిటీలో సువిశాలమైన స్థలంలో టిహాబ్…2 భవనాన్ని త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు. ఇందుకు సంబంధించిన ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకోనున్నామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News