Friday, November 22, 2024

రేపు షేక్‌పేట్ ప్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR will inaugurate shaikpet flyover tomorrow

హైదరాబాద్: నగర వాసులకు మరో ప్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పించడంతో పాటు సిగ్నల్ ఫ్రీ నగరంగా మార్చడంలో భాగంగా వ్వూహాత్మక రహదారుల అభివృద్ది(ఎస్‌ఆర్‌డిపి) ద్వారా పలు ప్లైఓవర్లు, అండర్ పాస్‌లు, జంక్షన్ల అభివృద్దికి జిహెచ్‌ఎంసి రూపకల్పన చేసినవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.333.55 కోట్ల అంచనా వ్యయంతో 2.8 కిలో మీటరల మేర 6 లైన్లతో షేక్‌పేట్ వద్ద నిర్మించిన అతిపెద్ద ప్లైఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కె.తారాక రామారావు రేపు ఉదయం 11.30 గంటలకు ప్రారంభించి నూతన సంవత్సరం కానుకగా నగరవాసులకు అంకింతం ఇవ్వనున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి అథ్యక్షతన జరగనున్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ప్రభుత్వ విఫ్ అరెకెపూడి గాంధీ, ఎంపిలు కె.కేశవరావు, జి.రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరి రాజు, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాధ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, కార్పొరేటర్లు షేక్ అహ్మద్, మహమ్మద్ రషీద్ ఫరజుద్దీన్, వి. గంగధర్‌రెడ్డి తదితరులు పాల్గొనున్నారు.

నగరంలోనే అతిపెద్ద ప్లైఓవర్ 

ఖైరతాబాద్ జోన్ శేరిలింగంపల్లి జోన్ల కలుపుతూ గెల్కాసీ థియేటర్ నుంచి మల్కమ్ చెరువు వరకు 2.8 కిలో మీటర్ల మేర 6 లైన్లతో నిర్మించిన ఈ ప్లై ఓవర్‌ను నిర్మించారు. ఇది అందుబాటులోకి రావడం ద్వారా ఓయు కాలనీ, ఫిల్మ్‌నగర్, 7టూమ్స్, విస్పెరీ వ్యాలీ ఈ నాలుగు జంక్షన్లలో మేజర్ కారిడార్ గుండా ప్రతి రోజు రాకపోకలు సాగించే 4 లక్షల వాహనాన దారులు ప్రీ సిగ్నల్ రహదారి అందుబాటులోకి రానుంది. అదేవిధంగా లక్డికాపూల్ ,మెహిదిపట్నం, టోలిచౌకి మీదగా గచ్చిబౌలి వరకు 11 కిలో మీటర్ల మేజర్ ట్రాఫిక్ కారిడార్‌లో మెరుగై న రవాణా సౌకర్యంతో పాటు రేతిబౌలి నుంచి ఓఆర్‌ఆర్ గచ్చిబౌలి వరకు ప్లైఓవర్ కలుపునుంది. అంతేకాకుండా ఈ ప్లైఓవర్ బయోడైవర్సీటి జంక్షన్ నుంచి జెఎన్‌టియు జంక్షన్ కలుపుతూ 17 కిలో మీటర్ల మేర ఏలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News