Wednesday, January 22, 2025

రేపు పేటకు మంత్రి కెటిఆర్ 

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మంగళవారం నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి కెటిఆర్ ఉదయం 10గంటలకు పేటకు చేరుకుంటారు. అనంతరం బిఆర్‌ఎస్ జిల్లా నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత సమీకృత మార్కెట్ సముదాయం, సఖి కేంద్రం, కొండారెడ్డి పల్లి చెరువు వద్ద పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, స్థానిక మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను సోమవారం కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కె.వనజా ఆంజనేయులు గౌడ్‌లు బిఆర్‌ఎస్ కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News