న్యూఢిల్లీ: దేశంలో ప్రాంతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో జరిగే సిఆర్‌పిఎఫ్ రిక్రూట్మెంట్ల పరీక్ష మాధ్యమం ఇప్పుడు తీవ్రస్థాయి వివాదాస్పద అంశం అవుతోం ది. ప్రాంతీయ భాషలలో ఈ పరీక్షను నిర్వహించడం కుదరదని సిఆర్‌పిఎఫ్ గురువారం స్పష్టం చే సింది. ఇంతకుముందెప్పుడూ సిఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రాతపరీక్షలు ప్రాంతీయ భాషలలో నిర్వహించలేదని, ఇప్పుడు మాధ్యమ మార్పు సాధ్యం కాదని వి వరణ ఇచ్చారు. రసంబంధిత విషయంపై వివరణ ఇచ్చుకుంది. స్పష్టమైన వివరణతో తి రిగి ఈ పరీక్షలపై వివాదం తీవ్రస్థాయిలో రా జుకుంది. ఇప్పుడు 9212 సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్స్ ఖాళీలు ఉన్నాయి. ఇందులో పాతిక శాతం వరకూ తెలుగు, తమి ళం, మళయాళం, కన్న డ భాషలు మాట్లాడే వా రికి ఉంటాయి. ఈ వి ధంగా సగం వరకూ హిందీయేతర రాష్ట్రాలకు చెందిన వారు 50 శాతం వ రకూ ఈ పరీక్షలు రాస్తారు.
అయితే దీనిని గుర్తించకుండా ఈ పరీక్షలలో 100 మార్కులలో 25 మార్కులను హిందీ అవగావహన ప్రాతిపదికన కలిపేలా చేయడం దారుణం అని, దీనితో హిందీరాని ప్రాంతీయ భాషల విద్యార్థులు దేశంలో ఎక్కడైనా ఈ రిజర్వ్ పోలీసు ఉద్యోగాలు చేసేందుకు సిద్ధపడ్డ యువతరాన్ని నీరుగార్చినట్లు అయిందని ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నత స్థాయిల్లో నిరసన వ్యక్తం అయింది. కానీ ప్రాంతీయ భాషలలో పరీక్షల పద్థతి ఇప్పటివరకూ ఆనవాయితీగా లేదని సిఆర్‌పిఎఫ్ పేర్కోనడం హిందీ హిందీయేతర గొడవను తీవ్రతరం చేసింది. మాతృభాషల్లో చదువుకున్న వారికి హిందీతో పరిచయం లేని వారికి అన్యాయం చేసినట్లు అవుతుందని, ఎప్పుడో ఓసారి వచ్చే ఇటువంటి ఉద్యోగావకాశాలకు భాషాపరమైన గండి పడుతుందని ఆందోళన వ్యక్తం అయింది. వివిధ ప్రాంతీయ భాషలతో కూడిన విభిన్న భాషల దేశంలో ఏదో ఒక భాష ఆధిపత్యాన్ని చాటేందుకు నిబంధనల పేరిట వ్యవహరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నలు తలెత్తాయి. ప్రాంతీయ భాషలలో ఈ పరీక్ష రాసేందుకు వీలు కల్పించాలని తెలంగాణ తరఫున మంత్రి కెటిఆర్ కేంద్రానికి లేఖ రాశారు.
తమిళనాడు సిఎం స్టాలిన్ ఇటీవలే హోం మంత్రి అమిత్‌షాకు విషయం తెలిపారు. కేంద్రం నుంచి దీనిపై స్పందన రాలేదు. సిఆర్‌పిఎఫ్ నుంచి వివరణ వచ్చిపడింది. బాధితుల గొడును కేంద్రం పట్టించుకున్నట్లు లేదని విమర్శలు తలెత్తాయి. దీనిపై పలువురు తమ ట్విట్లర్ల ద్వారా ఆసేతుహిమాచలంలో స్పందనలు వెలువరిస్తున్నారు. హిందీ ప్రాంతీయ భాష కాదా? హిందీనే ప్రధానంగా తీసుకుని పరీక్షలు రాయాలనే నిబంధన ఎందుకు? ఇంతకు ముందు ఎప్పుడూ ఈ విధంగా చేయలేదని రిజ్వాన్ అహ్మద్ అనే వ్యక్తి నిరసన వ్యక్తం చేశారు. కర్నాటక ఎన్నికలలో ఇదో ప్రధాన అంశం అయితే కేంద్రానికి బిజెపికి చురకలు పెట్టినట్లు అవుతాయని కన్నడిగుడు ఒక్కరు వ్యాఖ్యానించారు.
హిందీమాట్లాడే వారికే ఉద్యోగాలా?
ఇప్పుడు ప్రకటించిన సిఆర్‌పిఎఫ్ ఉద్యోగాలు కేవలం హిందీ మాట్లాడే వారికే పరిమితం అని అనుకోవల్సి ఉంటుందా? అలా అయితే హిందీ హిందీయేతర బాషావివాదాలు మరింత తీవ్రతరం కావా? అని ఓ యువకుడు ప్రశ్నించారు. హిందీవాళ్లకే సిఆర్‌పిఎఫ్ ఉద్యోగాలు అనుకుంటే ఇక హిందీయేతర రాష్ట్రాలకు సిఆర్‌పిఎఫ్ కోసం కేటాయించిన నిధులను కూడా వెనకకు తీసుకుంటే బాగుంటుందని వినయ్ బోర్డే సలహా ఇచ్చారు. హిందీమాట్లాడే వారికే ఉద్యోగాలుఅయితే వారికే పన్నులు కూడా వేయండని షణుగ్మం అనే తమిళ వ్యక్తి స్పందించారు. ఓ వ్యక్తి తీవ్రస్థాయిలో మాట్లాడుతూ హిందీయేతర ప్రాంతాల్లో ఉన్న కంటోన్మెంట్లకు ఇప్పటి చర్యకు ప్రతిగా కరెంటు నీటి సరఫరా ఎత్తివేస్తే పోతుందని వ్యాఖ్యానించారు. హిందీ ఆంగ్లం నేర్చుకుని ఉంటే యువతకు ఈ తిప్పలు తప్పవుగా అని ఓ యువకుడు తెలిపారు.
కోర్టుకు వెళ్లి పరీక్షలపై స్టే తెచ్చుకుంటే
వెంటనే అన్యాయం నివారించుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించి ఈ పరీక్షలపై స్టే తెచ్చుకుంటే బాగుంటుందని సౌందర్ అనే వ్యక్తి స్పందించారు. 2014 నుంచి అభ్యంతరం లేనప్పుడు ఇప్పుడెందుకు ఈ పరీక్షపై వివాదం? రాజకీయాలు ఆపండని ఓ వ్యక్తి అస్పష్టంగా స్పందించారు. బిజెపి ఈ విధంగా దక్షిణాది యాంటి అనే పేరు తెచ్చుకుందని తమిళియన్ ఒకరు చెప్పారు. ప్రాంతీయ భాషలంటూ వాటిని దూరంగా పెట్టడం ఎందుకు? వీటిని రాష్ట్రాలలో రాజభాషలుగా గుర్తిస్తారు కదా? వీటికి ప్రాధాన్యత లేకపోతే ఇక రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుందా? అని నరేన్ రెడ్డి ఆగ్రహించారు. సుప్రీంకోర్టుకు వెళ్లి తీరాల్సిందేనని ఓ అభ్యర్థి సూచించారు.
సిఆర్‌పిఎఫ్‌లో ఉత్తరాదులను నింపే యత్నం?
దారుణ నిర్ణయం అని మరో విద్యార్థి తెలిపారు. హిందీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అధికార భాషగా ఉంది. హిందీ ఇంగ్లీషులలో పరీక్షల నిబంధన పెడితే తప్పేముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. పైగా సిఆర్‌పిఎఫ్‌లో పనిచేయాల్సి వచ్చినప్పుడు దేశంలో ఎక్కడైనా డ్యూటీలకు దిగాల్సి ఉంటుంది. వారు హిందీ మాట్లాడలేని స్థితిలో ఉంటే పైగా దేశంలో అత్యధికశాతంలో మాట్లాడుకునే భాష సరిగ్గా రాకుంటే ఇక అక్కడ ఉద్యోగాలు చేయడం కష్టమే అవుతుందని హిందీ ప్రాంత అభ్యర్థులు తెలిపారు. స్థానిక భాషలే తెలిసిన వారు ఈ ఉద్యోగాలు పొంది ఇతర ప్రాంతాలకు వెళ్లడం జరగదా? తమ స్వరాష్ట్రాలలోనే పనిచేస్తారా? అని కూడా ప్రశ్నలు వెలువడ్డాయి. మరో వ్యక్తి తీవ్రస్థాయి ఆక్షేపణీయ ప్రశ్నకు దిగడం జరిగింది. హిందీయేతర రాష్ట్రాలపై వేరే కోణంలో కేంద్రం కుట్ర పన్నిందనే రీతిలో సాగిన ఈ వ్యాఖ్యను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదని ,కానీ పరిస్థితి ఇదే విధంగా ఉందని ఓ విద్యావేత్త వ్యాఖ్యానించారు.