Monday, December 23, 2024

పేద ప్రజల కోసం తొలి సంతకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పేద ప్రజలకు మేలు జరిగే ఫైలుపై మంత్రి కెటిఆర్ తొలి సంతకం చేయనున్నారు. నగరంలో లక్ష మందికి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీకి సంబంధించి మార్గదర్శకాల ఫైలుపై మంత్రి కెటిఆర్ సంతకం పెట్టనున్నారు. నేడు నూతన సచివాలయంలో భవనం ప్రారంభం తరువాత కెటిఆర్ దీనికి ఆమోదం తెలుపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి నేడు మంత్రి కె. తారకరామారావు అడుగుపెట్టబోతున్నారు.

నూతన సచివాలయం మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కెటిఆర్ ఇకనుంచి విధులను నిర్వర్తించనున్నారు. నూ తన సచివాలయం నుంచి విధులను ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి కెటిఆర్ నేడు అత్యంత కీలకమైన ఫైలుపై మొదటి సంతకం చేయనున్నారు. నగరంలో జీహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలుపై మంత్రి తొలి సంతకం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News