హైదరాబాద్: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కు తెలంగాణ ఐటిపురపాలక శాఖ మంత్రి కెటిఆర్ శనివారం లేఖ రాశారు. పలు అంశాలను కెటిఆర్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చేనేత రంగంపై మోడీ ప్రభుత్వానికి చిన్నచూపు, నిరాసక్తత ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అందుకే చేనేతపై జీఎస్టీ వంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. మోడీ సర్కార్ తెలంగాణ నేతన్నల కడుపు కొడుతోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసత్యాలు మాని నేతన్నకు సాయం చేస్తే మందిదన్నారు. తెలంగాణ టెక్స్ టైల్, చేనేత కార్మికులకు అదనపు సాయం చేయలేదని విమర్శించారు. అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు కేంద్రం ఎక్కడ సాయం చేసిందని ప్రశ్నించారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు ఎటుపోయిందన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యండ్ లూమ్ టెక్నాటజీ ఎర్పాటు ఎక్కడని మంత్రి ప్రశ్నించారు. పవర్ లూం మగ్గాల అప్ గ్రేడేషన్ కు నిధుల అంశం ఏమైందని మంత్రి కెటిఆర్ లేఖ లో పేర్కొన్నారు.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కెటిఆర్ లేఖ
- Advertisement -
- Advertisement -
- Advertisement -