Monday, January 20, 2025

మానవత్వం చాటుకున్న కెటిఆర్

- Advertisement -
- Advertisement -
KTR helped
రోడ్డు ప్రమాద బాధితులను తన కారులో ఆసుపత్రికి తరలించిన కెటిఆర్

మునుగోడు: తెలంగాణ రాష్ట్ర సమితి  వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ మంగళవారం తన మానవత్వాన్ని చాటుకున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరై తిరిగి హైదరాబాద్ వెళుతున్న సందర్భంగా రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను చూసిన కెటిఆర్ తన కాన్వాయ్ ను ఆపి, కారు దిగి రోడ్డు ప్రమాద బాధిత దంపతులను పరామర్శించారు. తర్వాత వారిని తన కాన్వాయ్ లోని ఓ కారులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మంగళవారం మానవత్వాన్ని చాటుకున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారానికి హాజరై తిరిగి హైదరాబాద్ వెళుతున్న సందర్భంగా రోడ్డు ప్రమాదానికి గురైన దంపతులను చూసిన కేటీఆర్ తన కాన్వాయ్ ను ఆపారు. కారు దిగి రోడ్డు ప్రమాద బాధిత దంపతులను ఆయన పరామర్శించారు. అనంతరం వారిని తన కాన్వాయ్ లోని ఓ కారులో  ఎక్కించుకుని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం మునుగోడు పరిధిలోని పలు గ్రామాల్లో కెటిఆర్ రోడ్డు షో నిర్వహించారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి కాస్తంత ముందుగానే ఆయన తన ప్రచారాన్ని ముగించారు. అనంతరం  హైదరాబాద్ కు తిరిగి వెళుతున్న సమయంలో ఆయన రోడ్డు ప్రమాద బాధితులను తన కాన్వాయ్ లో ఆసుపత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News