Sunday, December 22, 2024

ఏది కావాలి మనకు? ఆలోచించు తెలంగాణ రైతన్నా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులకు సంక్షేమ పథకాలపై మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్నా అని కెటిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్.. కడుపునిండా ఇస్తున్న ఇస్తున్న 24 గంటల విద్యుత్ కావాలా?.. కర్నాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల విద్యుత్ కావాలా?.. కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పిన 3 గంటల కరెంట్ కావాలా?.. ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్ళు కావాలా ?.. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్సఫార్మర్లు మళ్ళి ఆ రోజులు రావాలా?.. రైతుబంధు, రైతుబీమా ఇచ్చి ప్రాజెక్టులు కట్టిన కెసిఆర్ కావాలా?.. నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కెసిఆర్ కావాలా?… అని మంత్రి కెటిఆర్ రైతులను ఆలోచించాలని కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News