Saturday, January 11, 2025

ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

- Advertisement -
- Advertisement -

Minister KTR's visit to Adilabad and Nirmal districts

హైదరాబాద్‌: మాజీ మంత్రి, ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న గారి మాతృమూర్తి జోగు బోజమ్మ గారు ఇటీవల మరణించిన సందర్భంగా వారిని పరామర్శించడానికి హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ కు బయల్దేరి వెళ్లిన రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, డా. వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి గార్లు. ఇటీవల ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ మరణించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్‌ పరామర్శిస్తారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా 11.30 గంటలకు ఆదిలాబాద్‌ పట్టణానికి చేరుకుంటారు. బీడీఎన్‌టీ ల్యాబ్స్‌, ఎన్‌టీటీ డాటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఐటీ టవర్స్‌ ఉద్యోగులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదిలాబాద్‌ నుంచి బయలుదేరి ఒంటి గంటకు నిర్మల్‌ జిల్లా బాసర చేరుకుంటారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో భేటీ అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు. 3 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరుతారు. మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా పర్యటించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News