- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి కెటిఆర్, బృందం పర్యటన ముగిసింది. చివరిరోజు పలు సంస్థలతో కెటిఆర్ సమావేశమయ్యారు. మంత్రి కెటిఆర్ భేటీ తర్వాత నాలుగు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించాయి. రూ.1.750 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆర్ఎ చెమ్ ఫార్మా, అడ్వంట్ ఇంటర్నేషనల్ చెప్పాయి. స్లే బ్యాక్ ఫార్మా కంపెనీ రూ. 150 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. అటు ఔషద తయారీ కేంద్రం ఏర్పాటుకు యునైటెడ్ స్టేట్స్ ఫార్మాకొపియా ముందుకొచ్చింది.
- Advertisement -