Monday, December 23, 2024

నేడు నిజామాబాద్ జిల్లాలో మంత్రి కెటిఆర్‌ పర్యటన

- Advertisement -
- Advertisement -

Minister KTR's visit to Nizamabad district today

హైదరాబాద్‌: నిజామాబాద్ జిల్లాలో మంత్రి కెటిఆర్‌ పర్యటించనున్నారు. జిల్లాలోని సిద్ధాపూర్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వర్ని మండలంలోని సిద్ధాపూర్‌కు వెళ్లనున్నారు. ఉదయం 10.30 గంటలకు సిద్ధాపూర్‌లో రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం 10.45 గంటలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. అనంతరం 11 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సిద్ధాపూర్‌ ప్రాజెక్టును రూ.119.41 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. దీనిద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. మొత్తం వ్యయంలో రూ.72.52 కోట్లు రిజర్వాయ్‌ పనులకు, రూ.46.89 కోట్లు గ్రావిటీ కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. మంతి కెటిఆర్‌ పర్యటనలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News