Monday, January 20, 2025

నేడు బాధ్యతలు స్వీకరించనున్న మంత్రి మహేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి నేడు పదవీ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈనెల 24వ తేదీన రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా నేడు బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. కాగా, మంత్రి పి.మహేందర్ రెడ్డిని మంగళవారం సమాచార శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. మంత్రిని కలిసిన వారిలో సమాచార శాఖ డైరెక్టర్ బి. రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లీ, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకట రమణ, డిడిలు మధుసూదన్, రాజా రెడ్డి, సీఐఈ రాధ కిషన్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News