Monday, December 23, 2024

వాళ్లు ఓట్లు అడిగితే చీపుర్లతో కొట్టండి : మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్ : నిజామాబాదు జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూరు మండలం అడవి మామిడి పల్లి గ్రామంలోని వంజరి సంఘం ఫంక్షన్ హల్ లో జరిగిన మాక్లూరు మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, బిజెపి వాళ్లకు ఓట్లు అడిగితే చీపుర్లతో కొట్లాలన్నారు. మీ దగ్గర అర్వింద్ ఎంపి ఎలా అయ్యాడో.. మా దగ్గర రేవంత్ రెడ్డి అలానే ఎంపి అయ్యాడని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఏ మొఖం పెట్టుకుని అధికారంలోకి వస్తారా.. రోడ్ల మీద తిరుగుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తా అంటున్నారు అని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ కవిత, స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, వివిధ సంస్థల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News