Wednesday, January 22, 2025

అన్నివర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యం: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమనికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై గొర్రెల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నాడు నేడు అనే వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపు ఏ ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తూ చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ కులవృత్తులు చేసే వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

మిషన్ కాకతీయ తో చెరువులన్నీ నీటితో కలకలాడుతున్నాయని మిషన్ భగీరథతో ఇంటింటికి నీటి సరఫరా చేస్తున్నామన్నారు. కల్యాణలక్ష్మి, పింఛన్లు ఇలా ప్రతి ఇంటిలో ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. మేడ్చల్ మండలానికి మొత్తం 15 యూనిట్లు ఒక్క యూనిట్ లో 21 గొర్రెలు ఉంటాయని అన్నారు. తెలంగాణ మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉందని అన్నారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి గొర్రెల కాపరి మారి కాసేపు స్థానిక నాయకులతో కలిసి సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చామకూర మహేందర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు నారెడ్డి నందా రెడ్డి, ఎంపిపి రజిత రాజమల్లారెడ్డి, జడ్పిటిసి శైలజ విజయానంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ ఎంపిపి పద్మ జగన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్, జగన్‌రెడ్డి, పశు సంవర్ధక శాఖ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News