Tuesday, December 24, 2024

కాంగ్రెస్‌ది స్కాంల ప్రభుత్వం..బిఆర్‌ఎస్‌ది స్కీంల ప్రభుత్వం :మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: 56 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం స్కాంలేనని పదేళ్లలోనే ఎక్కడ లేని విధంగా అభివృద్ది చేసిన బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదు స్కీంల ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ స్కాంలు కావాలా? బిఆర్‌ఎస్ పార్టీ స్కీంలు కావాలా? ప్రజలే నిర్ణయించాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం కండ్లకోయ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం మేడ్చల్ మండలంలోని 17 గ్రామాల బూత్ కమిటీల ముఖ్య నాయకుల సమావేశం బిఆర్‌ఎస్ పార్టీ మేడ్చల్ మండల అధ్యక్షులు దయానంద్‌యాదవ్ ఆధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్లు గా బిఆర్‌ఎస్‌కు ఓటేందుకు వేయొద్దొ చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి సాగు నీరందిస్తున్నందుకా….ఇంటింటికి గో దావరి మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు ఇస్తున్నందు కా, దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ది, సంక్షేమ ప థకాలను అమలుపరుచుతున్నందుకా? ఎందుకు ఓటు బి ఆర్‌ఎస్‌కు వెయొద్దొ ప్రజలే అడగాలని పిలుపునిచ్చారు.

మైనంపల్లి కాదని ఆయన మైనం పిల్లి అని ఎద్దేవ చేశారు. దాదాగిరి, గూండాగిరి చేసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి కబ్జాలు చేశారని అన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వరుడి ముందు అధిష్టానంను ఆపేక్షించారని వెంటనే మై నంపల్లి హన్మంతరావుకు తగిన శాస్తి జరిగిందని అన్నా రు. మైనంపల్లి మల్కాజిగిరి, ఆయన కొడుకు మెదక్‌లో ఓ డిపోతారని ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నా రు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్‌రెడ్డి తన కుటుంబ సభ్యులందరికి పదవు లు పొందారని అన్నారు. తనను నమ్ముకున్న బిఆర్‌ఎస్ పార్టీ నాయకులకు ఆయన చేసిందేమి లేదని అన్నారు. ఆదరించిన పార్టీకే నేడు మోసం చేస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదని జోస్యం చె ప్పారు. రేవంత్‌రెడ్డి ఓ పెద్ద బ్లాక్ మేయిలర్ అని ఆయన తనను కూడా బ్లాక్ మేయిల్ చేసి డబ్బులు తీసుకొని తన కూతురి వివాహనం చేసుకున్నాడని తెలిపారు.

మళ్లీ అధికారంలోకి బిఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందని ముఖ్యమం త్రి కేసీఆర్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తారని అ న్నారు. బిఆర్‌ఎస్ పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి ల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దర్గ దయాకర్‌రెడ్డి, జిల్లా రై తుబంధు అధ్యక్షులు నారెడ్డి నందారెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ భాస్కర్‌యాదవ్, మేడ్చల్ ఎంపిపి వీర్లపల్లి రజితారాజమల్లారెడ్డి, జడ్పీటిసి శైలజా విజయానందరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసి లు, నాయకులు వీర్లపల్లి రాజమల్లారెడ్డి, జగన్‌రెడ్డి, భా గ్యారెడ్డి, సత్యనారాయణ, సుదర్శన్, బూత్ కమిటీ సభ్యు లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News