Wednesday, January 22, 2025

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Malla Reddy election campaign in munugode

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీని గెలిపించి, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక సందర్బంగా టిఆరెఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా చౌటుప్పల్ మండలం పరిధిలోని అరెగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజిపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. మునుగోడు ప్రజలను మోసం చేసిన కోమటిరెడ్డి ఒక 420 అని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఉప ఎన్నికలో టిఆర్ఎస్ దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రజల కోసం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మునుగోడు అభివృద్ధి చెందాలంటే టిఆర్ఎస్ ను గెలిపించాలని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News