Monday, December 23, 2024

బండి సంజయ్‌ పై మండిపడ్డ మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వాఖ్యలపై మంత్రి చామకూర మల్లారెడ్డి మండిపడ్డారు. శనివారం కీసరలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై కక్షకట్టిన బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ దాడులతో బయపెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు.

ఎమ్మెల్సీ కవిత పట్ల కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆయన మాట్లాడిన మాటలు యావత్ తెలంగాణ మహిళలు, ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయని మంత్రి అన్నారు. బండి సంజయ్ పద్దతి మార్చుకోకుంటే తెలంగాణ మహిళలు చీపుర్లతో తరిమికొడతారని మంత్రి మల్లారెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News