తొడగొట్టి సవాల్ చేసిన మంత్రి మల్లారెడ్డి
n నేను నీతిగా సంపాదించా n నీలా బ్లాక్ మెయిల్ చేయలేదు n ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం
మన తెలంగాణ/హైదరాబాద్ : పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దరిద్రపు మొకపోడు, బ్రోకర్, బట్టెబాజ్, గజదొంగ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఎం తో నీతిగా డబ్బు సంపాందించానన్నారు. అంతేతప్ప రేవంత్‌లా ఎవరిని బ్లాక్‌మెయిల్ చేసి సొమ్ములు కూడబెట్టుకోలేదన్నారు. భూములను కబ్జా చేసినట్లుగా ఆ రోపించిన రేవంత్ దమ్ముంటే వాటిని రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఇ ద్దరం రాజీనామా చేసి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం… ఎవరి సత్తా ఏమిటో తేల్చుకుందామా? అని ప్రశ్నించారు. ఎంపిగా రేవంత్ తిరిగి గెలిచినట్లు అయినతే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని మంత్రి మల్లారెడ్డి తొడగొట్టి సవాల్ విసిరారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఎంఎల్‌ఎ కెపి వివేకానంద, ఎం ఎల్‌సి శంభీపూర్ రాజు, టిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ,మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. మల్లారెడ్డి విద్యా సంస్థలకు ఎలాంటి అనుమతులు లేవని రేవంత్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. తన విద్యా సంస్థల్లో ఎలాంటి అక్రమాలు లేవని పార్లమెంట్‌లో కేంద్రమే స్పష్టంగా ప్రకటించిందన్నారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. దీని కోసం ఏ గుడిలో ప్రమాణం చేసేందుకు అయినా సిద్ధమేనని అన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తనకు విద్యా సంస్థలున్నాయని వెల్లడించారు. తనకు 600 ఎకరాల భూమి ఉందని….అందులో అసైన్డ్, చెరువులకు సంబంధించినది, కబ్జా భూమి లేదని స్పష్టం చేశారు. అంతా న్యాయబద్ధంగా కొనుగోలు చేసి, అభివృద్ధి చేసిన భూమి అని మంత్రి మల్లారెడ్డి వివరించారు. అలాగే విద్యాసంస్థల్లోని భవనాలన్నింటికీ సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. మూడు చిం తలపల్లిలో రూ. 62కోట్లతో అన్ని రకాల అభివృద్ధి పను లు చేశామని మంత్రి మల్లారెడ్డి వివరించారు. మూడు చింతల పల్లి అనే కొత్త మండలం ఏర్పాటు చేసింది కూడా టిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. మూడు చింతలపల్లిలో సమస్యలు లేవు కాబట్టే.. రేవంత్ ను రావొద్దు అని ప్లకార్డులు చూపించారన్నారు. మూడు చింతలపల్లిలో ఉ న్న అభివృద్ధి కొడంగల్‌లో ఉందా? ఈ సందర్భంగా ఆ యన ప్రశ్నించారు. రేవంత్‌లా తాను ఎపుడూ బ్రోకర్ దం దా చెయ్యలేదన్నారు.
తాను సంపాధించడమే కాకుండా లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. బ్రోకరిజం చేసి పిసిసి పదవి దక్కించుకున్న రేవంత్‌రెడ్డితో నీతి వ్యా ఖ్యాలు చెప్పించుకునే పరిస్థితుల్లో లేనని అన్నారు. పిసిసి పదవిని చూసుకుని అప్పుడే సిఎం అయినట్లు పగటి కలలు కంటున్నారని మల్లారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉం టే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. కాంగ్రెస్ దివాళా తీసిన పార్టీ అని అన్నారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ హయంలో జరిగిన అభివృద్ధి ఏమిటో రేవంత్ చెప్పాలన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్‌ను ప్రజల సమక్షంలో దోషిగా నిలబెడతానని ఆగ్రహంతో ఊగిపోయారు. రేవంత్ అవినీతి చిట్టా ఒక్కటొక్కటిగా విప్పుతానని హెచ్చరించారు. ఎంపిగా కొనసాగుతున్నారన్న గౌరవంతో ఇప్పటివరకు రేవంత్ పట్ల మర్యాదగా వ్యవహరించానన్నారు. కానీ తన మౌనాన్ని రేవంత్ చేతకాని తనంగా భావిస్తుంటే చూస్తూ ఉండలేనన్నారు.
రాజీనామాకు సిద్ధమా?
ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దాం. రేవంత్ సవాల్ అంగీకరిస్తే రేపే రాజీనామా చేస్తానని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి పదవికి సైతం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. రేవంత్ కూడా పిసిసి పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలన్నారు. ఇద్దరం పోటీ చేద్దామన్నారు.