Monday, January 20, 2025

గురుకులాలతో నాణ్యమైన విద్య

- Advertisement -
- Advertisement -

ఘట్‌కేసర్: దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున గురుకుల కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దక్కుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామ పరిధిలోని డిఆర్‌సి మహింద్రహిల్స్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంఘీక సంక్షేమ రెసిడెంటల్ డిగ్రీ కళాశాలల రాష్ట్ర స్థాయి రెండు రోజుల క్రీడాపోటీలను శనివారం మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఇప్పటి వరకు నాణ్యమైన విద్యను దాఖలలు ఎక్క డ లేవని, కేసిఆర్ కేజీటూ పీజి విద్యలో బాగంగా వేయ్యి గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడ లేనివిధంగా తె లంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థిమీద 1లక్ష 25 రూపాలయలు ఖర్చు చేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలలు పెద్ద పీఠవేస్తుందని, క్రీడలలో, చదువులలో రానిస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 30 రెసిడెంటల్ డిగ్రీ కళాశాలల నుండి 90 మంది క్రీడా కారిణీలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిఎస్‌డబ్లుఆర్‌ఈఐఎస్ ఓఎస్‌డి సి. చంద్రకాంత్ రెడ్డి, ఎంపిపి ఏనుగు సు దర్శణ్ రెడ్డి, ఘట్‌కేసర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, జెఎస్ సకృనాయక్, ఓఎస్‌డి (హెచ్‌ఈ) బానుప్రసాద్, స్పోర్ట్ ఆఫీసర్ రామలక్ష్మయ్య, నోడల్ స్ఫోర్ట్ ఆఫీసర్ ఎం.శేషు కుమారి, మహింద్రహిల్స్ ఆర్‌డిసి ప్రిన్సిపా ల్ జి. నిరుప, యాదాద్రీ ఆర్‌సిఓ రజిని, ఇన్‌చార్జీ ఆర్‌సి ఓ విద్యులత, అంతర్జాతీయ క్రీడాకారిణీలు నందిని, మా యవతి, భాగ్యలక్ష్మీ, లావణ్య, సర్పంచ్‌లు కొమ్మిడి జల జ, ఓరుగంటి వెంకటేష్ గౌడ్, కొంతం వెంకట్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ చందుపట్ల ధర్మారెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగుపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News