Sunday, December 22, 2024

పోలీసుల బొజ్జలపై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ పోలీసుల పొట్టలపై కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొట్టలున్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దంటూ రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీకి సలహా ఇచ్చారు. తనలాగా ఫిట్ గా ఉంటేనే ప్రమోషన్లు ఇవ్వండంటూ కామెంట్స్ చేశారు. మంత్రి మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 12వ తేదీన తెలంగాణ రన్ 1లక్ష మంది తో నిర్వహించి తెలంగాణ లో రికార్డ్ సాధిస్తామని అని మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ డిఎస్ చౌహన్ కి ఛాలెజ్ చేశారు. మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేట్ లో మల్కాజ్గిరి జోన్ రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నూతన పోచారం ఐటీ కారిడర్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోమ్ శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీతో కలిసి మల్లారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News