- Advertisement -
హైదరాబాద్ : నూతనంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంంబర్‌లోతన కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయ బద్దంగా పూజ కార్యక్రమలు నిర్వహించి బాధ్యతలు చేపట్టిన
అనంతరం మే డే కార్యక్రమాల్లో భాగంగా ఇవ్వనున్న “శ్రమ శక్తి ” అవార్డుల ఫైల్ పై ఆయన తొలి సంతకం చేశారు.అలాగే కార్మిక సంక్షేమానికి సంబంధించిన మరి కొన్ని ఫైళ్లపైనా సంతకాలు చేశారు. కాగా మల్లారెడ్డిని ఈ మేరకు తన నియోజక వర్గం నుండి అభిమానులు, నాయకులు పెద్ద సంఖ్యలో సచివాలయానికి విచ్చేసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -