Wednesday, January 22, 2025

కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం : మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని సోమవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని అన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు ప్రత్యేక హోదా రాలేదని చెప్పారు. బిఆర్‌ఎస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తున్నదని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ హయాంలో గత ఏమిదేండ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News