Wednesday, January 22, 2025

ఎన్నికల ప్రచారంలో మంత్రి మల్లారెడ్డి బిజీ బిజీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పోచారం మున్సిపాలిటీ పరిధిలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌జికె కాలనీలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ కార్యక్రమంలో పాల్గొని ఆయన తమ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అంతకు ముందు అన్నోజిగూడలో జరిగిన బిఆర్‌ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొని దాదాపు 100 మంది యువకులకు గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అంతే కాకుండా అన్నోజిగూడ నుండి ఆర్‌జికె కాలనీ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి మల్లా రెడ్డి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News