Thursday, January 23, 2025

పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్న మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -
  • బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతకింది వేణుగోపాల్

ఘట్‌కేసర్: మరణించిన పేద కుటుంబాలకు మంత్రి చామకూర మల్లారెడ్డి అండగా ఉంటూ తన ట్రస్టు ద్వారా ఆర్థిక సహాయం అందించడం హర్షనీయమని బిఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు చింతకింది వేణుగోపాల్ అన్నారు. ఘట్‌కేసర్ మండలం అంకుషాపూర్‌లో ఇటీవల మరణించిన కుమ్మరి బచ్చమ్మ, గేటు చంద్రకళల కుటుంబ సభ్యులకు మల్లారెడ్డి ట్రస్టు ద్వారా ఒకోక్క కుటుంబానికి 5వేల ఆర్థిక సహాయాన్ని గురువారం వేణు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబంలో మరణించిన వారి అంత్యక్రియల ఖర్చులకు 5వేల రూపాయలు అందించి మంత్రి మానవత్వాన్ని చాటుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అర్ధ బుచ్చిరెడ్డి, మెడబోయిన సాయిలు, చింతల గోపాల్ రెడ్డి, మల్లారెడ్డి ట్రస్టు సభ్యులు గోవిందా వేణు తదితరులు పాల్గొన్నారు.
29జిటికెపి 05 ః ఆర్థిక సహాయం అందిస్తున్న వేణుగోపాల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News