కెసిఆర్ ప్రధానమంత్రి కావాలి
అసెంబ్లీలో మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ దేశానికి ప్రధాని కావాలని మంత్రి మల్లారెడ్డి కోరుకున్నారు. కెసిఆర్ ప్రధాని అయితే రాష్ట్రాన్ని ఎలాగైతే ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారో దేశాన్ని కూడా అభివృద్ధి బాటలో పెడుతారని, అప్పుడు దేశ ప్రగతే మారిపోతుందన్నారు. దీంతో అభివృద్ధి చెందినట్లే దేశం కూడా ప్రగతి పథం లోకి వెళ్తుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో కార్మిక, ఉపాధి కల్పన పై పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కార్మికులు ముక్కోటి దేవతలన్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతి కార్మికుడిని ఆదుకుందన్నారు. కానీ కేంద్రం మా త్రం వారిని రోడ్డుపై పడేసే ప్రయత్నం చేస్తుంద న్నారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలను కూడా అమ్మేయడం దారుణమన్నారు. అయితే తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిం చేందుకు ప్రత్యేక సెంటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నామని మంత్రి వివరించారు.
Minister Mallareddy speech at Assembly