Monday, December 23, 2024

ఎంపీ నామాకు కేంద్ర మంత్రి క్షమాపణలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ లోక్‌సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మనసుఖ్ మాండవీయ లేఖ రాశారు. ఆ లేఖలో తన పొరపాటును అంగీకరించారు. ఈ నెల 16వ తేదీన లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో నామా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ… బల్క్ డ్రగ్ పార్క్ ను తెలంగాణాకు కేంద్రం
కేటాయించిందని మౌఖికంగా సమాధానం ఇచ్చారు.

అయితే కేంద్రం ఇచ్చిన సమాధానం వాస్తవం కాదని, తదనంతరం నామా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పూర్వపరాలను తెలుసుకున్న కేంద్ర మంత్రి నామాను క్షమాపణలు కోరారు. తానిచ్చిన సమాధానాన్ని సరిచేసుకుంటున్నట్లు లిఖిత పూర్వకంగా ఆయనకు రాసిన లేఖలో కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News