Tuesday, November 5, 2024

మీరేం న్యాయం చేస్తారు?..రాహుల్ యాత్రపై బిజెపి మీనాక్షి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రాహుల్ చేపట్టే భారత్ న్యాయ యాత్రను బిజెపి తేలిగ్గా తీసిపారేసింది. ఇది ఉత్తి నినాద ఆర్భాట తంతు, ఇటువంటి వాటితో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టలేదు. మోసగించలేదు అని కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ మంత్రి మీనాక్షీ లేఖి తెలిపారు. ఏ ఉద్ధేశంతో రాహుల్ ఆధ్వర్యంలో న్యాయం పేరిట యాత్ర తలపెట్టారు? ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు తగు విధంగా న్యాయం చేస్తోందని , ప్రగతి సమపంపిణీకి దారులు ఖరారు చేసిందని పేర్కొన్నారు.

దేశంలో ఏళ్ల తరబడి అధికారం పాతుకుని సాగిన కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఏం న్యాయం దక్కిందని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ద్వారా ప్రజలకు ఏం జరుగుతుందని స్పందించారు. ప్రత్యేకించి దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలడం, నిరర్థక ఆస్తుల పేరిట భారీ రుణాల మంజూరీతో బ్యాంకు రుణాల విషయంలో పూర్తి స్థాయి దగా తప్ప ఏం ఒరిగిందని, కాంగ్రెస్ హయాంలో అన్నింటా అన్యాయమే జరిగిందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News