Tuesday, November 5, 2024

50% కమిషన్లకు సాక్షాలు ఏవీ?

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం 50 శాతం కాంట్రాక్టర్ల కమిషన్ల ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి భగ్గుమంది. ప్రియాంక గాంధీకి అసత్యాలు వల్లించడం పరిపాటి అయిందని, ఇటువంటి అవాకులుచెవాకులకు దిగితే తగు విధంగా చర్యలు ఉంటాయని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా శనివారం హెచ్చరించారు. ఎంపి సర్కారు ఫిఫ్టిపర్సెంట్ రేట్ల కమిషన్ సర్కారు అని ప్రియాంక ట్వీటు వెలువరించారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదని, ఆరోపణలు చేసే ముందు వీటికి బలం చేకూర్చే సాక్షాధారాలు చూపెట్టాలని మంత్రి సవాలు విసిరారు. ఆమె తన వాదనను నిరూపించుకోలేకపోతే బిజెపి ప్రభుత్వం, పార్టీ వర్గాలు తగు విధంగా స్పందిస్తాయని చెప్పారు.

ఆమె మాట చక్కదిద్దుకోవాలి, లేదా మాట మీద నిలబడాల్సి ఉంటుందని, ఈ రెండూ కాదనకుంటే తాము చేసేది తాము చేసి చూపుతామని హెచ్చరించారు. శుక్రవారం ప్రియాంక వెలువరించిన ట్వీటులో ప్రియాంక గాంధీ స్పందిస్తూ కర్నాటకలో ఇంతకు ముందటి బిజెపి ప్రభుత్వం కమిషన్లు 40 శాతం రికార్డులుగా ఉన్నాయని, ఇదే ఇక్కడి మధ్యప్రదేశ్‌లోని బిజెపి కమిషన్ల వ్యవహారాలు 50 శాతానికి చేరిందని విమర్శించారు. కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్టు పనుల బిల్లులు చెల్లిస్తున్నారని రాష్ట్రంలోని కాంట్రాక్టర్లు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని ప్రియాంక తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎటూ పాలుపోని తలతిక్కల చేష్టలకు దిగిందని, ఇందులో భాగంగానే ప్రియాంక గాంధీ అర్థం లేని మాటలని మంత్రి, బిజెపి ఇతర నేతలు ఎదురుదాడికి దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News