Saturday, November 23, 2024

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

Minister Nawab Malik Arrested by ED

ముంబై: మహారాష్ట్ర మంత్రి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు బుధవారం అరెస్ట్ చేశారరు. దావూద్ ఇబ్రహీం, ఆయన అనుచరుల కార్యకలాపాలకు సంబంధించిన కేసులో మాలిక్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి బుధవారం ఉదయం 6 గంటలకు నవాబ్‌మాలిక్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు ఓ గంటసేపు ప్రశ్నించిన తరువాత 7.30 నిమిషాలకు ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో మాలిక్ ఈడీకి సహకరించలేదని సమాచారం. అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్‌తోపాటు పరారీలో ఉన్న ఉగ్రవాద ఫైనాన్సర్ దావూద్ ఇబ్రహీ, అతని సోదరుడు అనీస్ ఇక్బాల్, సహాయకుడు చోటా షకీల్, ఇతరులపై నమోదైన కేసులో ఈడీ ముందు హాజరు కావాలని నవాబ్ మాలిక్‌కు ఇదివరకే సమన్లు జారీ అయ్యాయని సమాచారం. ఈ విషయమై గత వారం ఈడీ వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈడీ దాడులను ఆధారం చేసుకుని ఎన్‌ఐఎ కేసు నమోదు చేసింది. దావూద్ ఇబ్రహీం సహాయకుడితోపాటు ఆయన సోదరి హసీనీ ఫార్కర్‌తో నవాబ్‌మాలిక్ డీల్స్ కుదుర్చుకున్నట్టు బలమైన ఆరోపణలు ఉన్నాయి.
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ విమర్శ
నవాబ్ మాలిక్ అరెస్టుపై ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఈ విధంగా నవాబ్ మాలిక్‌ను టార్గెట్ చేస్తారని తమకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసు గురించి తనకు తెలియదని, అయితే ప్రత్యర్థులను అప్రతిష్ఠ పాలు చేయడానికి దావూద్ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను పనిచేసిన కాలంలో తనకు కూడా అండర్‌గ్రౌండ్‌వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్టు ఆరోపించారన్నారు. పాతికేళ్ల తరువాత అదే చిట్కాను ఉపయోగిస్తున్నారన్నారు.
ప్రతిపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపణ
మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ కోట్ల విలువైన ఆస్తులను 30 లక్షల రూపాయలకు గోల్‌మాల్ చేశారని, సర్దార్ శవాలీ ఖాన్, సలీమ్ పటేల్‌ల నుంచి ఈ ఆస్తులను నవాబ్‌మాలిక్ కొనుగోలు చేశారని ఆరోపించారు.

Minister Nawab Malik Arrested by ED

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News