Friday, December 20, 2024

గోవా మంత్రి నీలేష్ కాబ్రాల్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

పనజి : ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వం లోని మంత్రివర్గంలో పబ్లిక్ వర్క్ డిపార్టుమెంట్ మంత్రిగా ప్రస్తుతం ఉన్న నీలేష్ కాబ్రాల్ తన మంత్రి పదవికి ఆదివారం రాజీనామా చేశారు. గోవాలో మరో ఎమ్‌ఎల్‌ఎ అలీక్సో సిక్వేరాకు కేబినెట్‌లో అవకాశం కల్పించడం కోసం నిలేష్ కాబ్రాల్ ఆదివారం మంత్రివర్గం నుంచి వైదొలగవలసి వచ్చింది. గత ఏడాది విపక్ష కాంగ్రెస్ నుంచి విడిపోయి అధికార బీజీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్‌ఎల్‌ఎల్లో సికేరా ఒకరు.

నీలేష్ కాబ్రాల్ తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి పంపానని తెలియజేశారు. అధికార బీజేపీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అవకాశం కల్పించడానికి తాను మంత్రి పదవి నుంచి వైదొలగినట్టు నీలేష్ తెలిపారు. కాబ్రాల్ రాజీనామా పత్రాన్ని గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లైకు పంపానని ముఖ్యమంత్రి తెలిపారు. 51 ఏళ్ల నీలేష్ కాబ్రాల్ గోవాలో కర్చోరెమ్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బరువెక్కిన హృదయంతో తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని కాబ్రాల్ తన రాజీనామా పత్రంలో వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News