Saturday, November 16, 2024

తెలంగాణ నమ్మకం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వీఆర్ఎలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఇందూ గార్డెన్ లో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులైన వీఆర్ఎ కుటుంబాల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొ్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…  అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వివిధ శాఖలలో నియమించామని ఆయన వెల్లడించారు. వచ్చిన అవకాశాన్ని అందరూ సంతోషంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం, నిరాదరణకు గురయిన ప్రతి వర్గాన్ని గుర్తించి చేరదీస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో జీవించాలని 23 వేల మంది వీఆర్ఎలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని నిరంజన్ రెడ్డ స్పష్టం చేశారు.

గ్రామ సేవకులు అనే అనాగరిక భాషను తొలగించి వీఆర్ఎలు అని పేరు మార్చాం.. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను చేశామని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు అత్యధిక జీతాలు అందుకుంటున్నది తెలంగాణ రాష్ట్రంలోనే, ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణది దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News