- Advertisement -
హైదరాబాద్: వరిపై ఆంక్షలు కాదు, లాభసాటి పంటలు వేయమని చెప్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వానాకాలం ఎవరిష్టం వారిది, ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. రైతన్న పంటతో మార్కెట్ కు పోవడం కాదు.. కల్లం వద్దకే మార్కెట్ ను రావాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. కొందరు స్వార్థపరులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రైతులు అర్థం చేసుకుని ఇతర పంటల సాగు చేస్తున్నారు. బియ్యం కాకుండా వడ్లు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ విజయాలను మరుగున పడేయాలని చూస్తున్నారని చెప్పారు. బిజెపి నేతలు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
- Advertisement -