హైదరాబాద్ : తెలంగాణ విషయంలో బిజెపి ద్వంద విధానాలను అనుసరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ అధికారం కోసమే బిజెపి ఆరాటమని.. రాష్ట్రంలో ఆ పార్టీకి పప్పులు ఉడకవు అన్నారు. సకల జనుల, సకల సంస్కృతుల సమాహారం తెలంగాణ అన్నారు. ఎనిమిదేళ్లకు బిజెపికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గుర్తుకు వచ్చిందన్నారు. తల్లిని చంపి పిల్లను బతికించారని ప్రధాని అంటారు .. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాత్రం అమిత్ షా వస్తారు. నివాళులు అర్పించడం కాదు .. తెలంగాణకు న్యాయంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. ఉపన్యాసాలు కాదు .. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 , 2018 ఎన్నికలలో దేశ ప్రజలకు, రైతులకు బిజెపి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి చూపాలన్నారు. రాష్ట్రానికి కెసిఆర్ మాత్రమే న్యాయం చేస్తారు.. ఇందుకు నిదర్శనం ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన అవార్డులే అన్నారు.
రాష్ట్రంలో బిజెపి పప్పులు ఉడకవు
- Advertisement -
- Advertisement -
- Advertisement -