హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. తెలంగాణను నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. తెలంగాణ పౌరులను వలసల పాలు చేసింది కాంగ్రెస్ అన్నారు. తెలంగాణలో వరి ధాన్యం కొనాలని రాహుల్ ఎక్కడా ప్రశ్నించలేదని గుర్తుచేశారు. తెలంగాణలో బిజెపి గెలవాలని కాంగ్రెస్ ఆరాటం పడుతుందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఏడేళ్లుగా కేంద్రం నుంచి అందుతున్న అవార్డులే అందుకు నిదర్శనమన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం చేతులె్తేస్తే.. కెసిఆర్ ధాన్యం కొంటున్నారు. బిజెపి, కాంగ్రెస్ లకు సాగురంగంపై ఒక విధానమంటూ లేదని ఆరోపించారు. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు నేలకేసికొట్టారని మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ: మంత్రి నిరంజన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -