Sunday, December 22, 2024

నాకున్న ఆస్తులు.. మంత్రిపదవి రాకముందు నుంచి ఉన్నవే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను 39 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను, నేనేంటో ప్రజలకు తెలుసని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రఘనందన్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… రఘనందన్ రావు పూర్తి పరిజ్జానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్డీఎస్ కాలువలు, ఎక్కడున్నాయో, శ్రీశైలం ముంపు భూములు ఎక్కడున్నాయో తెలుసుకోవాన్నారు.

తనకు, తన కుటుంబానికి భూములు ఉన్న ప్రాంతంలో ఆర్డీఎస్ భూములు లేవన్నారు. రఘనందన్ రావు చెప్పిన సర్వే నంబర్ 60 లో మాకు 3 ఎకరాలు భూమి మాత్రమే ఉందన్నారు. న్యాయవాదిగా చేసిన రఘనందన్ రావు ఆధారాలు లేకుండా మాట్లాడారని చెప్పారు. తన భూమి చుట్టూ ప్రవారీగోడ నిర్మించామనటం అబద్ధం అన్నారు. మేం కొన్న భూమి కంటే గుంటభూమి ఎక్కవ ఉన్నా.. ఏ చర్యకైనా సిద్ధమని ఆయన పేర్కొన్నారు. రఘనందన్ రావు ఆరోపణలు తప్పని రుజవైతే ఆయన ఏం చేస్తారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

రఘనందన్ రావు వస్తే… ఆయన మందే సర్వే జరిపిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. తన కటుంబానికి ఉన్న మొత్తం భూమి 90 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. తన వ్యవసాయ భూమిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు లేవని మంత్రి తెలిపారు. తన భూమిలో ఫౌల్టీ, డెయిరీ షెడ్లు మాత్రమే ఉన్నాయన్నారు. నాకున్న ఆస్తులు.. నాకు మంత్రి పదవి రాకముందు నుంచి ఉన్నవే అన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News