Monday, December 23, 2024

లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తాం: మంత్రి నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister niranjan reddy comments on Rythu bandhu

హైదరాబాద్: రైతుబంధు స్వీకరిస్తున్న అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు డబ్బులు వేశామని నిరంజన్ రెడ్డి తెలిపారు. 24.68 లక్షల ఎకరాలకు రూ.1.234 కోట్లు, ఈ రెండ్రోజుల్లో ఎకరా, రెండెకరాలు ఉన్నవారికి రూ.1820.75 కోట్లు జమ చేసినట్లు మంత్రి వివరించారు. రెండు రోజుల్లో మొత్తం 36.41 లక్షల ఎకరాలకు సాయం అందిందన్నారు. ప్రభుత్వం పదెకరాలకు పైగా ఉన్న లబ్ధిదారులకు రూ.250 కోట్లేనని ఆయన స్పష్టం చేశారు. రైతుబంధు అబ్ధిదారుల్లో ఐదెకరాలు ఉన్న వారు 92.50శాతం మంది ఉన్నారని తెలిపారు. ఈ ఏడాది వానాకాలంలో 68.10 లక్షల మందికి రైతుబంధు అందనుందని చెప్పారు. 9వ విడత రైతుబంధు కింద లబ్ధదారులకు రూ.7,508 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. గత ఎనిమిది విడతల్లో రూ.50.448 కోట్లు పంపిణీ చేశామని సూచించారు.

లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదాయం రెట్టింపు చేస్తామని రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రైతులపై భారం మోపిందని ఆరోపించారు. ఏడేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు వెళ్లాయని లెక్క చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ.1.68 లక్షల కోట్లే వచ్చాయని పేర్కొన్నారు. కేంద్రం బిజెపేతర పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేస్తోందన్నారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని తాము కలవడం లేదన్నారు. దేశవ్యాప్తంగా రైతుబంధు ఇస్తామని బిజెపి తీర్మాణం చేయాలన్నారు. వ్యవసాయానికి కేంద్రం 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల పంటలకు మద్దతు ధరలను చట్టబద్ధం చేయాలని కోరారు. కేంద్రం ప్రభుత్వమే పంటల కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి. పంపు సెట్లకు మీటర్లు బిగించబోమని బిజెపి డిక్షరేషన్ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News