Monday, December 23, 2024

బండికి ఆర్‌డిఎస్ మొన, కొన తెలియవు

- Advertisement -
- Advertisement -

ప్రాజెక్టుల గురించి తెలియకుండా మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారన్న ఇంగిత జ్ఞానం కూడా అతడికి లేదు

వడ్లు మేమే కెసిఆర్
ప్రకటించగానే మీ విజయం
అని సిగ్గు చెప్పుకున్నావు
తెలంగాణ ఏపాత్ర
లేనివారు, విద్రోహ పాత్ర
కలిగినవారు ముఠాగా ఏర్పడి
తెలంగాణను పరిహసిస్తున్నారు
ఆర్‌డిఎస్ ఆయకట్టుకు
నీళ్లిస్తామన్న మాటను తుమ్మిళ్ల
ఎత్తిపోతల పథకం ద్వారా
కెసిఆర్ నిలబెట్టుకున్నారు
మంత్రి నిరంజన్ రెడ్డి

మన హైదరాబాద్ : రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్‌డిఎస్) పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తప్పుబట్టారు. ఆయనకు ఆర్‌డిఎస్ ‘కొన తెల్వదు.. మొన తెల్వదు’ అని మంత్రి ఘాటుగా విమర్శించారు. ‘పాలమూ రురంగారెడ్డి ఎత్తిపోతల పంపులు తెల్వవు.. రిజర్వాయర్లు తెల్వవు’ అని ని ప్పులు చెరిగారు. శుక్రవారం ఓ ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టుల గురించి తెలవకుండా మాట్లాడితేప్ర జలు నవ్వుకుంటున్నారన్న ఇంగితం కూడా సంజయ్‌కు లేదని ఎద్దేవా చే శారు. మొన్న కొంటాం .. రైతులు వరి వేయాలి .. కేంద్రంలో ఉన్నది మా ప్రభుత్వం అన్నావ్ .. వరి పంట కోతకొచ్చాక మొకం చాటేశావ్.. ఢిల్లీకి వెళ్లి లొల్లిపెట్టినా కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయమనడంతో రైతుల బాధలు తెలిసిన కెసిఆర్ తామే కొంటామన్నారు.

కెసిఆర్ వడ్లు కొంటాం అని ప్రకటించగానే అది మా విజయం అని సిగ్గులేకుండా ప్రకటించుకున్నావ్.. బండి సంజయ్ ది, బిజెపిది నాయినా, పులి కథ గుర్తుకు తెస్తుంది. ఉద్యమం జరిగినప్పుడు కలిసి రమ్మంటే పారిపోయిన పార్టీ బిజెపి .. కిషన్‌రెడ్డి తెలంగాణ కోసం రాజీనామా అడిగితే అమెరికాకు పారిపోయాడు.. ఇక ఉద్యమంలో నీ అడ్రస్ ఎవరికీ తెలియదు. ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేకపోగా విద్రోహ పాత్ర కలిగిన వారంతా ముఠాగా ఏర్పడి తెలంగాణను పరిహసిస్తున్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది .. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నది గుర్తుంచుకోవాలని మంత్రి హెచ్చరించారు.

ఆరు నెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తి చేస్తావు..?

ఆరు నెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తి చేస్తావో కాగితం రాసిస్తావా? అని బండిని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆర్డీఎస్ కాలువను నిజాం ప్రభుత్వం ప్రతిపాదించింది. 1946లో పనులు ప్రారంభమై 1958లో పూర్తయిందని మంత్రి తెలిపారు. తుంగభద్ర నదిపై రాయచూర్ జిల్లా మాన్వి వద్ద నిర్మించిన అంతర్ రాష్ట్ర ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు పూర్తి ఆయకట్టు 93,379 ఎకరాలని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆర్డీఎస్‌కు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 17.1 టిఎంసిల నీటిని కేటాయించిందని మంత్రి గుర్తుచేశారు. ఆర్డీఎస్ ప్రధాన కాలువ మొత్తం 142 కిలోమీటర్లు కాగా, మొదటి 42 కిలోమీటర్లు కర్ణాటకలో, మిగతా 100 కిలోమీటర్లు తెలంగాణలో ఉందన్నారు. ఈ కాలువ ద్వారా అలంపూర్ నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించడం ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. కానీ ఆర్డీఎస్ కాలువ ద్వారా ఎన్నడూ కర్ణాటక పూర్తిగా నీరిచ్చిన దాఖలాలు లేవు. అలంపూర్ తాలూకాలో 87,500 ఎకరాల ఆయకట్టుకు 15.9 టిఎంసిల నీరందించాలి. కానీ ఇప్పటి వరకు ఎన్నడూ 20 వేల ఎకరాలకు నీళ్లు పారలేదని నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా కెసిఆర్ పాదయాత్ర..

ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు మద్దతుగా 2003 జులై 16న అలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద కెసిఆర్ పాదయాత్ర ప్రారంభించారు. జులై 25 వరకు పాదయాత్ర కొనసాగించి.. గద్వాలలో లక్షమందితో బహిరంగసభ నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత 2003, ఆగస్టులో ఆర్డీఎస్ ఆయకట్టు రైతాంగానికి జరుగుతున్న అన్యాయంపై ఉమ్మడి ఎపిలోని ఎంపిలందరికీ కెసిఆర్ బహిరంగ లేఖలు రాసిన విషయాన్ని కూడా నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. కెసిఆర్ తీసుకున్న ఈ చర్యల ద్వారానే ఆర్డీఎస్ సమస్యపై 2004 లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ వేసింది. ఆర్డీఎస్ ద్వారా తెలంగాణకు సాగునీరు అందడం లేదని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్‌పై సమీక్ష నిర్వహించారని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

దీనికి సంబంధించి 2017లో తెలంగాణ ప్రభుత్వం జీఓ 429 విడుదల చేస్తూ తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రూ.780 కోట్లతో చేపట్టి కేవలం పది నెలలలో పూర్తిచేసింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల కింద మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లను ప్రతిపాదించారు. ఈ రిజర్వాయర్లకు సంబంధించిన సర్వే పూర్తయిందని తెలిపారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా ఆర్డీఎస్ కాలువ కింద సాగు నీరందని, 50 వేల ఎకరాలకు నీరందించడం జరుగుతున్నదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు ఇస్తానన్న మాటను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నిలబెట్టుకున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

బండి ఆర్డీఎస్‌పై మాట్లాడటం హాస్యాస్పదం..

పుట్టిన నడిగడ్డను, తెలంగాణను గాలికి వదిలేసి, ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు అన్యాయం చేసి దోచుకుపోయిన హాంద్రీనీవా నీళ్లకు హారతిపట్టిన డికె అరుణను పక్కన పెట్టుకుని బండి సంజయ్ ఆర్డీఎస్ ఆయకట్టు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి అన్నారు. అసలు ప్రాజెక్టుల మీద బండి సంజయ్‌కు ఉన్న అవగాహన సున్నా.. అరవై ఏండ్ల కింద పూర్తయిన ఆర్డీఎస్‌ను ఆరునెలలలో పూర్తి చేస్తాననడం అవివేకం.. అవగాహనారాహిత్యం అని నిరంజన్‌రెడ్డి అన్నారు. నిజాం ప్రభుత్వం గద్వాల, వనపర్తి, అలంపూర్, కొల్లాపూర్ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అప్పర్ కృష్ణా ప్రాజెక్టును, దానిలో భాగంగా గద్వాల కాలువను ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. దీని ద్వారా దాదాపు 200 టిఎంసిల సాగు నీరు ఉమ్మడి పాలమూరు జిల్లా వాడుకునే అవకాశం ఉండేది. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రలో విలీనం కావడం, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ కాలువ కర్ణాటక వరకే కుదించబడిందని తెలిపారు.

ఈ రోజు అప్పర్ కృష్ణాలో భాగమైనటువంటి నారాయణపూర్, ఆల్మట్టి డ్యాంలలో దాదాపు 50 టిఎంసిలు ఈ వేసవిలో నిల్వ ఉన్నాయి. జూరాల, శ్రీశైలం ఎండిపోయాయి. కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వాన్ని ఒప్పించి ఎండాకాలంలో జూరాలను నింపే దమ్ము, ధైర్యం ఉందా ? ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ వద్ద 87,500 ఎకరాలకు సాగునీరు తీసుకువెళ్లేలా పనులు చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం వద్ద అనుమతి తీసుకురాగలిగే దమ్ముందా ? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కుంటలు, చెరువుల పునరుద్దరణతో నేడు 10 నుంచి 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద చెరువులు, కుంటలు నింపడం నిషేధం .. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీఓ 8 విడుదల చేసి అన్ని చెరువులు, కుంటలను ప్రధాన కాలువల కిందకు తీసుకువచ్చి ప్రతి ఏటా వాటిని నింపడం జరుగుతున్నదని మంత్రి వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News