Sunday, February 23, 2025

వనపర్తి లో మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నామినేషన్

- Advertisement -
- Advertisement -

వనపర్తి: వనపర్తి జనసంద్రమైంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొలెమోని లక్ష్మయ్య, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ ఎద్దుల కరుణశ్రీతో కలిసి సంప్రదాయ పద్ధతిలో ఎండ్లబండిపై వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. అడుగడుగునా డప్పుచప్పుళ్లు, కోలాటాలు, తప్పెట్లు, బతుకమ్మలతో వనపర్తి దద్దరిల్లింది. వనపర్తి రహదారులు స్తంభించాయి. పాలిటెక్నిక్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు గులాభీమయం అయ్యింది. నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజల రావడంతో జిల్లా కేంద్రం జనసంద్రమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News