హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని గురుతర బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. గుజరాత్ ఏర్పాటి 62 ఎళ్లైనా కరెంట్ కష్టాలు ఇంకా ఉన్నాయని మంత్రి సూచించారు. 8 ఏళ్ల తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణకు ఇతర ఏ రాష్ట్రాలు దరిదాపుల్లో కూడా లేవుని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేకులు సరైన సమయంలో నేలకేసి కొడతామని హెచ్చరించారు తెలంగాణ ఏడేళ్ల సగటు ఆర్థిక వృద్ధి రేటు 11.7 శాతం ఉందన్నారు. భారతదేశం సగటు ఆర్థిక వృద్ధి రేటు 6 శాతమేనని తెలిపారు. ఐటి, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ముందుందని మంత్రి పేర్కొన్నారు. సంక్షేమం మీద అత్యధికంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు. బిజెపి నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.