Wednesday, January 22, 2025

కెసిఆర్ ను దుర్భాషలాడడం సరికాదు: రేవంత్ కు నీరంజన్ రెడ్డి కౌంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరంటు మీద చేసిన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ కావడంతో రేవంత్ ప్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నాడో అర్ధం లేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి నీరంజన్ రెడ్డి విమర్శించారు. బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంశాలవారీగా సైద్దాంతిక ప్రాతిపదికన ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు.. సందర్భోచితంగా సహేతుకమైన విమర్శలు చేయవచ్చన్నారు. ప్రజలు, సమాజం విజ్ఞత కలిగి ఉంటారన్న విషయం గుర్తెరగాలని చెప్పారు. రెండో సారి ప్రజలు ఆమోదించిన ఉద్యమనేత ముఖ్యమంత్రి కేసీఆర్ ను దుర్భాషలాడడం సహేతుకం కాదన్నారు.

కేసీఆర్ ను విమర్శించినంత మాత్రాన రేవంత్ పెద్దవాడు అయిపోడని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే చంద్రబాబు చర్యలలో నీ పాత్ర అబద్దమా?, టీవీలలో పట్టుబడింది నిజమే కదా?.. నీ చర్యలను నీ పార్టీ శ్రేణులే హర్షించడం లేదని అన్నారు. ప్రభుత్వం ఎంచుకున్న పనులలో ప్రాధాన్యతా క్రమంలో కొన్ని మిస్ అవుతాయని, వాటిని చేసినట్లు మేము చెప్పుకోవడం లేదని, సమయాన్ని బట్టి వాటిని కూడా పూర్తిచేస్తామని చెప్పారు. రూ.86 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తారు.. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మాట్లాడే తీరు ఇదేనా?, వ్యక్తులను తూలనాడడం ఇదేం పద్దతి?, ప్రతిదానికి ఓ హద్దు ఉంటుంది అని రేవంత్ పై నిప్పులు చెరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News