Tuesday, January 21, 2025

మంత్రి నిరంజన్‌రెడ్డి కారుకు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కారుకు ప్రమాదం తృటిలో తప్పింది. మంగళవారం నారాయణపేట్ జిల్లా పర్యటనకు వెళ్తుండగా అమరచింత దాటిన తర్వాత జక్లేర్ సమీపంలో చెరువుకట్టపైకి వెళ్తున్న వరి కోత మిషన్ వాహనం అదుపుతప్పి వెనక్కు వచ్చింది. అదే సమయంలో అటు వెళ్లున్న మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనంపైకి అది దూసుకువచ్చింది. డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించటంతో తృటిలో ప్రమాదం తప్పిపోయింది.

మంత్రి ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం చివరి సీటు వద్ద చిన్న అద్దం పగిలింది. వరికోతమిషన్ వాహనం నడుపుతున్న డ్రైవర్ పరిస్థితిని అర్ధం చేసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి అక్కడినుంచి అతన్ని పంపించి వేశారు. అంతే కాకుండా వరికోతమిషన్ వాహనం డ్రైవర్‌పైన ఎటువంటి చర్యలుతీసుకోవద్దని, అతన్ని ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను ఆదేశించి మంత్రి నిరంజన్‌రెడ్డి తన కారులో యధావిధిగా నారాయణపేట పర్యటనుకు వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News