Sunday, January 19, 2025

మెడిసిన్ విద్యార్థికి మంత్రి ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు ః తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మెడిసిన్ విద్యార్థికి 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పెబ్బేరు పురపాలక పరిధిలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన మహిళా సంఘం సభ్యులు బొజ్జలమ్మ మనమడు బంగారు భాను ప్రకాష్ సిద్దిపేటలో ఉచిత మెడికల్ సీటు సాధించారు. వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ గౌని బుచ్చారెడ్డికి వివరించడంతో ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి తన సొంత నిధుల నుంచి 50 వేల రూపాయల చెక్కును సోమవారం విద్యార్థి భాను ప్రకాష్‌కు వనపర్తి జిల్లాలోని ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ముందుండాలని, ఆర్థిక స్తోమత లేనివారికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ గౌని బుచ్చారెడ్డి, సింగిల్ విండో చైర్మెన్ గౌని కోదండరామ్ రెడ్డిలకు బొజ్జలమ్మ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News