Wednesday, January 22, 2025

ఐదేళ్లలో భారత్ 5వ ఆర్థిక శక్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతదేశం వచ్చే ఎనిమిదేళ్లలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తి అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరపు రెండో ద్వితీయార్థం లో ఆర్థిక ప్రగతి 7.6 శాతంగా నిలిచిదని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక పెరుగుదల అని తెలిపారు. కాగా ఎప్రిల్ జూన్ త్రైమాసికంలో జడిపి ఎదుగుదల 7.8 శాతంగా ఉందని వివరించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో గురువారం జరిగిన చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రపంచంలో అన్ని సంపన్న దేశాలు ఇప్పుడు ఆర్థిక ప్రగతి దిశలో మందగమనంతో ఉన్నాయి.

తయారీ పిఎంఐలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. దేశంలో ఇప్పుడీ పరిస్థితి లేదని మంత్రి తెలిపారు. అమెరికా, యూరోజోన్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాలు కూడా ఇప్పుడు ఎదుగుదల లేని స్థితిలో ఉన్నాయని , కాగా మనం ముందుకు వెళ్లుతున్నామని నిర్మల తెలిపారు. జపాన్, జర్మనీ ఇప్పుడు మూడవ, నాలుగవ భారీ ఆర్థిక శక్తులుగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశాలు కూడా కుంటుపడుతున్నాయి. ఈ స్థితిలో భారతదేశపు 7 శాతానికి పైగా ఎదుగుదల గణనీయం అని వివరించారు. దేశంలో అన్ని రంగాలలో పెరుగుదల ఉందని, ప్రత్యేకించి ఉత్పత్తి రంగంలో ఇది భారీ స్థాయిలో ఉందన్నారు.

మేకిన్ ఇండియాతో మనం ముందుకు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేకిన్ ఇండియా కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని సభలో మంత్రి వివరించారు. దీనితో పాటు వివిధ ప్రభుత్వ పథకాలతో ఉత్పత్తి రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు మరింతగా దోహదం చేస్తున్నాయని అన్నారు. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు మన మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ 13.9 శాతం మేర వాటాను అందిస్తోంది. ఇక ప్రపంచంలో మన ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో రెండోస్థానంలో నిలిచింది. అమెరికా సూపర్ మార్కెట్లలో మేకిన్ ఇండియా ఉత్పత్తులకు మరింతగా విక్రమాలు పుంజుకుంటున్నాయని మంత్రి తెలిపారు.ఇక ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఇప్పుడు ఈ ఏడాది 21.82 శాతం మేర పెరిగింది.నెలవారి జిఎస్‌టి వసూళ్లు ఇప్పుడు రూ 1.6 లక్షల కోట్ల మేరకు చేరింది. ఇది ఖచ్చితంగా ఆర్థిక ప్రగతికి సరైన సంకేతం అవుతుందని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News