చెన్నై : తమిళనాడు లోని డీఎంకె ప్రభుత్వ పాలనలో పోలీస్‌లు హిందువులను ద్వేషిస్తూ దుర్వినియోగమవుతున్నారని, అయోధ్యలో రామ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు. సోమవారం కాంచీపురంలో విలేఖరులతో ఆమె మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీపై డిఎంకె వ్యక్తిగత ద్వేషం ప్రదర్శిస్తూ భక్తులను అణచి వేస్తున్నారని ఆరోపించారు.
అయోధ్య వేడుకలపై నిషేధం విధించారని బీజేపీ ఆరోపణల నేపథ్యంలో గవర్నర్ రవి ఆలయాన్ని సందర్శించడం తక్కువ చేయడం బీజేపీ ఆరోపణలకు ఊతం ఇచ్చినట్టు అయింది. చెన్నై వెస్ట్‌మాంబళంలో కోదండరామస్వామి ఆలయానికి తాను పూజించడానికి వెళ్లగా అక్కడ పూజారుల్లో, ఇతర సిబ్బంది ముఖాల్లో భయం కనిపించిందని గవర్నర్ రవి ఆరోపించారు. దేశం లోని మిగతా ప్రాంతాల్లో పండగ వాతావరణం కనిపించగా, ఇక్కడ మాత్రం విభిన్న పరిస్థితి ఉంటోందని ఆరోపించారు.