Friday, January 17, 2025

ముంబయి లోకల్ రైలులో నిర్మల సీతారామన్ ప్రయాణం

- Advertisement -
- Advertisement -

ముంబయి : ముంబయిలో ఒక లోకల్ రైలులో ప్రయాణికులు శనివారం ఉదయం ఒక అసాధారణ ప్రయాణికురాలిని చూసి విస్మయం చెందారు. ఆ విస్మయం వారిని ప్రత్యేక అనుభవాన్ని ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రైలులో వారి బోగీలోకి వచ్చి వారితో ముచ్చటించారు. ముంబయి సబర్బ్ స్టేషన్లు అయిన ఘాట్కోపర్ నుంచి కల్యాణ్ వరకు నిర్మలా సీతారామన్ రైలులో ప్రయాణిచినట్లు ఆమె కార్యాలయం ఆన్‌లైన్ పోస్ట్‌లో తెలియజేసింది.యువజనులు, ఆఫీసులకు వెళుతున్నవారితో మంత్రి సెల్ఫీలను ఆ పోస్ట్‌లో పొందుపరిచారు. లోకల్ రైళ్లను ముంబయికి జీవన రేఖగా పరిగణిస్తుంటారు. రోజూ 60 లక్షల మందికి పైగా ఆ రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా పలు సందర్భాలలో సార్వత్రిక రవాణా వాహనాలలో ప్రయాణించి, తోటి ప్రయాణికులతో ముచ్చటించిన విషయం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News