Tuesday, December 24, 2024

మంత్రి పెద్ది రెడ్డి, మిథున్ రెడ్డికి తప్పిన ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, అతడి కుమారుడు ఎంపి మిథున్ రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద జరిగింది. ఎంపి మిథున్ రెడ్డి తన బంధువుల ఇంటికి వెళ్తుండగా అతడి వాహనాన్ని ఎదురుగా కారు ఢీకొట్టడంతో వాహనం పల్టీలు కొట్టింది. కాన్వాయ్ లో ఎంపి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మంత్రి పెద్ది రెడ్డి, ఎంపి మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులంతా ఒకే కారు ఉండడంతో ప్రమాదం తప్పింది. పుంగనూరు నుంచి వీరబల్లిలోని అత్తగారింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News