Thursday, December 26, 2024

పులివెందులలో ప్లాన్… పుంగనూరులో అమలు: పెద్దిరెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓటమి భయంగా ఉందని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పెద్ది రెడ్డి మీడియాతో మాట్లాడారు. పుంగనూరు అల్లర్ల కుట్ర వెనుక నిజం ఇదేనని, పోలీసుల మీద దాడి చేయించింది చంద్రబాబేనని ధ్వజమెత్తారు. పులివెందులలో అల్లర్లకు ప్లాన్ చేసి పుంగనూరులో అమలు చేశారని దుయ్యబట్టారు. టిడిపి కార్యకర్తల వద్ద తుపాకులు, కర్రలు, బీరు సీసాలు ఎక్కడివి అని ప్రశ్నించారు. అడ్డంగా దొరికిపోయి కప్పిపుచ్చుకోవడానికే ఫిర్యాదులు చేస్తున్నారని దుయ్యబట్టారు. పుంగనూరులో రూట్‌మ్యాప్ దాటి ఎందుకు రావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎస్‌పి రిషాంత్ రెడ్డిని చంద్రబాబు టార్గెట్ చేశారని పెద్ది రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌పిని బ్లాక్ మెయిల్ చేయడం కోసం బాబు ఆరోపణలు చేస్తున్నారని, బాబు వ్యాఖ్యలపై పోలీసులే అసహ్యించుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Also Read: రెండు వేల మెట్టు దగ్గర ఎలుగుబంటి సంచారం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News